జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేన్‌తో అధికార పార్టీ టీఆర్ఎస్ అప్రమత్తమైంది. బల్దియాలో గత ఫలితాలే పునరావృత్తం అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందు కోసం పార్టీకి చెందిన ప్రజాప్రతనిధులందరినీ హైదరాబాద్‌కు షిఫ్ట్ చేస్తోంది. ఈక్రమంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం మధ్యాహ్నం 2గంటలకు తెలంగాణ భవన్‌లో భేటీ కానుంది.
టీఆర్ఎస్‌కు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి విధిగా హాజరు కావాలని ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. తమ తమ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను మంత్రులను కో ఆర్డినేట్ చేసుకొని.. సమావేశానికి తీసుకురావాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే అజెండాగా ఈ భేటీ జరగనుంది. నేతలందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.