– ఉపాధి కూలీ డబ్బులు అడిగిన దివ్యాంగుడు
– కోపంతో కాలితో తన్నిన సర్పంచ్
ఓ దివ్యాంగుడిపై టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అమానుషంగా దాడికి దిగాడు. కాలితో తంతూ అవమానించాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని పుల్పోనిపల్లి గ్రామంలో జరిగింది. దీనికి సంబందించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
కృష్ణయ్య అనే దివ్యాంగుడు తనకు రావాల్సిన ఉపాధి హామీ కూలీ డబ్బులు రాలేదని టీఆర్ఎస్ సర్పంచ్ శ్రీనివాసులు ను అడిగాడు. దీంతో కోపంతో రగిలిపోయిన శ్రీనివాసులు బండ బూతులు తిడుతూ కాలితో తన్నాడు. అలాగే మండల రెవెన్యూ అధికారులను కూడా తిట్టాడు.
పొగరు తలకెక్కితే ఇలాగే ప్రదర్శిస్తారంటూ సర్పంచ్ పై చుట్టుపక్కల వాళ్లు మండిపడుతున్నారు. అతనిపై కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాసులును సర్పంచ్ పదవి నుండి తొలగించాలని, పోలీసులు వీడియోను సుమోటోగా స్వీకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.