లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మంగళవారం నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఇక బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ కూడా నిరసన కార్యక్రమాలను చేపట్టింది. మోడీ దిష్టి బొమ్మ దహనంకు పిలుపునిచ్చింది.
ఇప్పటికే హైదరాబాద్ సహా పలు చోట్ల మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అజంపురా చౌరస్తాలో హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమంను చేపట్టారు.
బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా హోంమంత్రి నివాసం నుంచి ర్యాలీ గా బయలుదేరి చాదర్ ఘాట్ చౌరస్తాలోపీఎం మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ లోక్ సభలో మోడీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.