అధికార టిఆర్ఎస్ పార్టీలోని బడా నాయకుల నుంచి చోట నాయకుల వరకు అందరూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మేము చెప్పిందే వేదమన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. పేరుకే బంగారు తెలంగాణ… కానీ పేదవాడికి బతుకే కష్టంగా మారింది. తాజాగా వికారాబాద్ జిల్లా, యాలల్ మండలం,సంగెం కుర్దు గ్రామములో టిఆర్ఎస్ సర్పంచ్ దారుణానికి వడిగట్టాడు.
స్థానికంగా వడ్ల సునంద అనే మహిళ నివాసం ఉంటున్న ఇంటిని దౌర్జన్యంగా జేసీబీ తో కూల్చివేశాడు. గతంలో ప్రభుత్వం ఇనాం భూమిని కేటాయించింది. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంది సునంద. అయితే ఇప్పుడు ఆ భూమి విలువ పెరిగింది. దీనితో ఆ భూమిని వేరేవాళ్లకి అమ్మెందుకు సిద్ధం అయ్యాడు.వారి దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సునంద ఇంటిని కూల్చివేశాడు . ఇదేంటని అడగగా.. సర్పంచ్ తో పెట్టుకుంటావా అని అక్కడ పెద్ద మనుషులు కూడా అనటం విశేషం.