గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క సీటుతో సెంచరీ మిస్ అయిన టీఆర్ఎస్… ఈసారి సెంచరీ పూర్తి చేస్తామని ధీమాగా చెప్పింది. ఆ పార్టీ మెయిన్ బ్యాట్స్ మెన్స్ కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ సెంచరీ దాటేస్తామని పదే పదే చెప్తూ వచ్చారు.
కానీ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు చూస్తే… టీఆర్ఎస్ ను వరదలు ముంచేసినట్లు స్పష్టంగా కనపడుతున్నాయి. వరదలకు లోతట్లు ప్రాంతాల ప్రజలతో పాటు కష్టంలో ఉన్న ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేయని అధికార పార్టీని కూడా ముంచేసినట్లు స్పష్టంగా కనపడుతోంది.
హైదరబాద్ వరదలు ప్రధానంగా ఎల్బీనగర్ జోన్ తో పాటు పాతబస్తీని ఆనుకోని ఉన్న ప్రాంతాలు, మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ నష్టం చేశాయి. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిని ప్రజలు నిలదీయగా… హయత్ నగర్ కార్పోరేటర్ ను అయితే గల్లా పట్టి గుంజి కొట్టిన పరిస్థితులు కూడా కనపడ్డాయి. ఇప్పుడు రిజల్ట్ లోనూ అదే కనపడుతుంది. స్వయంగా ఎమ్మెల్యే భార్య ఓడిపోగా, వరద ముంచెత్తిన ఎల్బీనగర్ జోన్ లోని దాదాపు అన్ని స్థానాల్లోనూ బీజేపీయే విజయం సాధించింది. టీఆర్ఎస్ సర్కార్ వరద సహాయం కింద కుటుంబానికి 10వేలు పంచినట్లు చెప్పినా జనం తిరస్కరించినట్లు స్పష్టంగా కనపడుతోందని విశ్లేషకులంటున్నారు.