ఆ ఇద్దరు టీఆర్ఎస్ నేతలకు వానకాలంలోనూ సన్ స్ట్రోక్ తగిలిందా? ఇప్పుడు ఆ మాజీ మంత్రుల పరిస్థితి ఎంటీ… ఇప్పటికీ తేరుకోలేని పరిస్థితిలో ఉన్నారా? తొలి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఆ ఇద్దరు నేతలకు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మొదటి నుంచి కేసీఆర్ కు దగ్గరగా ఉన్న ఆ ఇద్దరు నేతలకు, సడెన్‌గా గులాబీ చంద్రుడు ఎందుకు దూరమయ్యాడు?
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఓరుగల్లు నాయకుల్లో ఆ ఇద్దరి పాత్ర అంతా ఇంతా కాదు. పార్టీ అధినేతకు ఒకరు కుడి అయితే, మరొకరు ఎడమగా సాగింది. వారే ములుగు జిల్లా నుండి మాజీ మంత్రి అజ్మీరా చందులాల్ ఒకరైతే, భూపాలపల్లి నుండి మాజీ స్పీకర్ మదు సూదనాచారి మరోకరు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఆ ఇద్దరికి సముచిత స్థానం కల్పించారు అధినేత కేసీఆర్. సమగ్రపాలనలో సఫలం కావాల్సిన ఆ ఇద్దరు నాయకులు కొడుకుల ప్రభావంతో పూర్తి స్థాయిలో విఫలం అయ్యారు అనే వాదనలు బలంగా వినబడ్డాయి. అయినా వాళ్ళతో ఉన్న అనుబంధం కారణంగా మరోమారు 2018 ఎన్నికల్లో అవకాశాం ఇచ్చారు కేసీఆర్.
ఇక్కడ మాత్రం జనాలు పార్టీ అధినేత నిర్ణయాన్ని తిరస్కరించారు. ఓటు హక్కుతో ఇంటికే పరిమితం చేసారు ఓటర్లు. నాటి నుండి సైలెంట్ అయిన ఆమాజీలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇద్దరు నాయకుల్లో అజ్మీరా చందులాల్ కాస్తో కూస్తో అక్కడక్కడ పార్టీ కార్యకలాపాలకు హాజరయిమప్పటికీ, మాజీ స్పీకర్ కేవలం ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఈ ఇద్దరు నాయకులు తమ కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం పాకులాడి చివరికి వారి రాజకీయ భవిష్యత్తుకే ఎసరు తెచ్చుకున్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.
ఇక, మదుసుధనాచారి నియోజకవర్గంపై కూడా పూర్తిగా పట్టుకోల్పోతున్నట్లు కనపడుతోంది. కొడుకుల వ్యవహారం ఒకవైపు ఉంటే కాంగ్రెస్ పార్టి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కారెక్కడం తో మదుసూదనాచరికి నియోజకవర్గంలో కారు పార్కింగ్ ప్లేస్ లెకుండా పోయింది. దీంతో అదిష్టానం వద్ద మొర పెట్టుకున్నా… పెద్దాయనకు సముచిత స్థానం కల్పిస్తానని కేసీఆర్ హమీ ఇచ్చారటా. అయితే ఆ హమీలో ఎలాంటిది మత్లబ్ ఉన్నది అనేది ప్రస్తుతం ఆయన అనుచరవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అసలు మదుసూనచారికి పదవి వరిస్తుందా అనేది ఇప్పడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇక మరో నాయకుడు మాజీ మంత్రి చందులాల్ ఆయన రాజకీయం కంటే తన కుమారుల రాజకీయమే నియోజకవర్గంలో రాజ్యమేలింది. దీంతో ఆయన ఓటమికి ఒక కారణమైతె ఆయన అనారోగ్య పరిస్థితులు కూడా రాజకీయ ప్రయాణానికి అడ్డుపడ్డాయి అనేది మరో వాదన. తాజ పరిస్థితుల్లో అజ్మీరాకు పార్టీ నుండి పిలుపు రావడం కష్టమే అని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. చందులాల్ రాజకీయ వారసత్వ భాద్యతలను తన కుమారుడికి ప్రస్తుతం నియోజకవర్గ పగ్గాలను అప్పగించి నాన్న బాటలో నడిచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చందులాల్ కుమారుడు అజ్మీరా ప్రహ్లాద్ కు ఇప్పటికే ఎంతో చెడ్డపేరు వచ్చేసింది. తండ్రి చేసిన మంచి కూడా ప్రహ్లద్ పుణ్యాన పోయింది అన్న టాక్ నియోజకవర్గంలో బలంగా ఉంది. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ప్రహ్లద్‌ను పార్టీ గుర్తించటం కష్టమే. .
ఇటు మదుసుధనాచారి, అటు చందులాల్ ఇద్దరు నేతలకు కొడుకుల కష్టంతో పాటు, కొడుకుల వల్ల తమకూ కష్టం వచ్చపడిందని వాపోతున్నట్లు జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.