ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఈ ఎన్నికల్లోనూ అనుసరించాలని ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికను రేపు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో రహస్య బ్యాలెట్ విధానంలో నిర్వహించనుండా 788 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆల్వాకు మద్దతుగా 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు రేపు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును కూడా రేపు సాయంత్రమే నిర్వహించనున్నారు. ఫలితాలను రేపు రాత్రి వరకు ప్రకటించనున్నారు.
ఈ ఎన్నికకు రిటర్నింగ్ ఆఫీసర్ గా లోక్సభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ఖడ్ పోటీ చేస్తున్నారు.