మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట్ గ్రామ సర్పంచ్ మేకల వెన్నెల ( మేకల వెన్నెల రామకృష్ణుడు ) అధికార దుర్వినియోగం కు పాల్పడ్డారు. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు వెన్నెలను పదవి నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…ఎల్లంపేట గ్రామ సర్పంచ్ మేకల వెన్నెల ( వెన్నెల రామకృష్ణుడు ) తన అధికారాన్ని దుర్వినియోగం చేసి గ్రామకంఠం భూమికి సంబంధించిన స్థలము ను సంభదిత వ్యక్తులవని దృవీకరిస్తూ గ్రామ పంచాయతీ ద్వారా దృవీకరణ పత్రాలను జారీ చేసి అధికార దుర్వినియోగంకు పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ పంచాయతి రాజ్ చట్టం 2018 ,సెక్షన్ 37 (1) ప్రకారం సర్పంచ్ పదవీ నుండి తెలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్.