పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి కేటీఆర్ ను టార్గెట్ చేశారని, పరుష పదజాలంతో కేసీఆర్-కేటీఆర్ లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు ప్రయత్నించారు.
ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న కాంగ్రెస్ శ్రేణులు టీఆర్ఎస్ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేయటంతో ఇరు పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం మొదలైంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగానే ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసి టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుండి పంపించేశారు.