బ్యాలెట్ పేపర్లపై ఇతర ముద్రలను కూడా ఓట్లుగా లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎట్టకేలకు నేరేడ్‌మెట్ ఫలితం తేలింది. తాజాగా జరిగిన ఓట్లు లెక్కింపులో ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. 782 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించినట్టు ఈసీ ప్రకటించింది.
వాస్తవానికి ఈ నెల 4వ తేదీనే నేరేడ్‌మెట్ డివిజన్ లెక్కింపు చేపట్టారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థికి 504 ఓట్ల మెజార్టీ వచ్చినప్పటికీ.. స్వస్తిక్ కాని ఇతర ముద్రతో ఉన్న ఓట్లు 544 ఉండటంతో ఇష్యూ హైకోర్టుకు చేరింది. మెజారిటీ కంటే లెక్కించని ఓట్లే ఎక్కువగా ఉండటంతో హైకోర్టు ఆదేశాలతో ఫలితాన్ని ప్రకటించలేదు. చివరికి హైకోర్టే ఓకే చెప్పడంతో ఇవాళ మిగిలిన ఓట్లనూ లెక్కించగా… టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు.