మున్సిపోల్స్‌లో అధికార టీఆరెఎస్‌కు మొబైల్ భయం పట్టుకుంది. అదేంటీ… మొబైల్‌కు మున్సిపోల్‌కు టీఆర్ఎస్‌కు లింకేంటి అనుకుంటున్నారా…? ఖచ్చితంగా ఉంది. అందుకే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మొబైల్ దళాన్ని రంగంలోకి దింపి ఎలా పనిచేయాలో డైరెక్షన్ ఇవ్వనున్నారు.
మెయిన్ స్ట్రీం మీడియా చేతులెత్తేసి ఎంతో కాలం అయ్యింది. పాలకులకు అనుకూలంగానో, తటస్థంగానే ఉండటం మినహా మీడియా ప్రజాపక్షం నుండి దూరంగా ఉంది. కానీ ప్రజలకు మొబైల్ వచ్చాక సోషల్ మీడియా అండగా ఉంటుంది. మెయిన్ స్ట్రీం మీడియా కన్నా ఎక్కువ ఎఫెక్ట్‌తో పనిచేస్తుంది. పైగా చదువుకున్న వారంతా ఇప్పుడు సోషల్ మీడియాను ఫాలో అవుతున్న వారే కావటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వరం ఉన్న వారు కావటంతో మున్సిపల్ ఎన్నికల ముందు సోషల్ మీడియా టీంతో కేటీఆర్ స్పెషల్‌గా సమావేశం కాబోతున్నారు.
టీఆర్ఎస్‌పై సోషల్ మీడియాలో ఎంతో నెగెటివ్ ఉంటుంది. మెయిన్ స్ట్రీం మీడియాలో కనపడని, చూపించని పాలకుల రంగులను సోషల్ మీడియా ఎండగడుతుంది. మున్సిపల్ ఎన్నికలకు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ ఎంతో ముఖ్యం. పైగా ఆరు సంవత్సరాల పాలనపై అసంతృప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో… సోషల్ మీడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా ఎలా ముందుకెళ్లాలి, నెగెటివ్ కామెంట్స్‌ను ఎలా దెబ్బకొట్టగలగాలి అన్న వ్యూహాన్ని కేటీఆర్ టీఆరెఎస్ సోషల్ మీడియా టీంకు వివరించనున్నారు. టీఆర్ఎస్ భవన్‌లో సోషల్ మీడియా టీంతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయి దిశా నిర్దేశం చేయబోతున్నారు.