అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు విదేశీ నేతల నుంచి వచ్చిన గిఫ్టుల ఆచూకీ తెలియడం లేదు. వాటి విలువ భారీగా వుంటుందని డెమోక్రటిక్ కాంగ్రెస్ కమిటీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఆ బహుమతులు ఎక్కడ వున్నాయనే విషయంపై కమిటీ ఆరా తీస్తోంది.

వాటిన్నింటి విలువ సుమారు రెండున్నర లక్షల డాలర్లకు పైనే ఉంటుందని డెమోక్రటిక్ కాంగ్రెస్ కమిటీ అంచనా వేసింది. కానీ విదేశాల నుంచి అందిన అత్యంత ఖరీదైన గిఫ్ట్‌ల వివరాలను అప్పటి ట్రంప్ సర్కార్ బహిర్గతం చేయలేదని కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది.
సౌదీ స్వార్డ్స్, ఇండియన్ జ్యువెలరీ, సాల్వడార్ ట్రంప్ పోట్రైట్ అన్న టైటిల్‌తో రిపోర్టును రిలీజ్ చేశారు. ఫారిన్ గిఫ్ట్స్ అండ్ డెరేషన్ యాక్టు కింద మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై చర్యలు చేపట్టారు. మిస్సైన ఆ భారీ గిఫ్ట్‌లు ఎక్కడ ఉన్నాయనే విషయంపై కమిటీ దర్యాప్తు ప్రారంభించింది.
విదేశాంగ విధానంలో భాగంగా పలు దేశాధినేతలు ట్రంప్‌కు బహుమతులు ఇచ్చారా లేదా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోందని కాంగ్రెస్ నేత జేమీ రాస్కిన్ వెల్లడించారు. ట్రంప్ ఫ్యామిలీకి సుమారు వందకుపైగా విదేశీ గిఫ్ట్‌లు అందాయని తెలుస్తోంది. వాటి విలువ సుమారు 25 మిలియన్ల డాలర్లు ఉంటుందని సమాచారం.
రిపోర్టులో తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్‌కు భారత్ నుంచి సుమారు 17 ఖరీదైన గిఫ్ట్‌లు అందాయి. భారత్ నుంచి వచ్చిన గిఫ్ట్‌ల మొత్తం విలువ 47 వేల డాలర్లు ఉంటుంది. వాటిలో యూపీ సీఎం యోగి ఇచ్చిన 8500 డాలర్ల విలువైన ఫ్లవర్ వాస్‌తో పాటు 4600 డాలర్ల విలువైన తాజ్ మహల్ ప్రతిమ వున్నాయి. వీటితో పాటు రాష్ట్రపతి కోవింద్ ఇచ్చిన 6600 డాలర్ల విలువైన రగ్గు, ప్రధాని మోడీ 1900 డాలర్ల విలువైన కఫ్‌లింక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.