మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న డోనాల్డ్ ట్రంప్.. మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా అమెరికా నుంచి బ్రెజిల్, ఇతర యూరప్ దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధాన్ని అనూహ్యంగా ఎత్తేశారు. నిషేధం విధించిన సమయం నాటి కంటే కూడా వైరస్ విజృంభణ ఎక్కువగా ఉన్నప్పటికీ.. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే చైనా, ఇరాన్‌పై విధించిన ఆంక్షల్ని మాత్రం సడలించలేదు.
ఇదిలా ఉంటే ట్రంప్ నిర్ణయాన్ని .. మరికొన్ని గంటల్లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న బైడెన్ బృందం తప్పుబట్టింది. ఆయా దేశాల్లో కరోనా మరింత విజృంభించినందున .. రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. తమ వైద్య నిపుణులతో సంప్రదించిన తర్వాతే.. ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.