అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ట్రంప్ కు చెందిన కంపెనీ పన్నులు ఎగవేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ట్రంప్ కంపెనీకు న్యూయార్క్ జడ్జి జరిమానా వింధించనున్నారు.
పన్నులు ఎగవేసిన ఎగ్జిక్యూటివ్ లకు సుమారు 1.6 మిలియన్ల డాలర్లు జరిమానా విధించే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ కేసులో తీర్పు వెలువడనుంది. అయితే కోర్టు తీర్పు సమయంలో ట్రంప్ కానీ, ఆయన పిల్లలు కానీ విచారణకు హాజరు కావడం లేదు. ట్రంప్ కంపెనీ తరుపున లాయర్లు కోర్టుకు హాజరుకానున్నారు.
ట్రంప్ కంపెనీ సుమారు 17 పన్ను నేరాలకు పాల్పడినట్లు కోర్టు గతంలో పేర్కొన్నది. బిజినెస్ రికార్డులను తప్పుగా చూపించినట్లు ట్రంప్ ఆర్గనైజేషన్ పై ఆరోపణలున్నాయి. ట్రంప్ ఆర్గనైజేషన్ లో ప్రతినిధులుగా చేసిన ఉద్యోగులకు అత్యధిక స్థాయిలో 1.6 మిలియన్ల డాలర్ల ఫైన్ మాత్రమే వేయనున్నట్లు తెలుస్తోంది.
జడ్జి జువాన్ మాన్యువల్ మెర్చన్ ఈ కేసులో తుది తీర్పు ఇవ్వనున్నారు. అయితే ఈ కేసులో ట్రంప్ విచారణకు హాజరు కాలేదు. తన కంపెనీలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ లు పన్ను ఎగవేసిన విషయం కూడా తనకు తెలియదని ఇటీవల ట్రంప్ పేర్కొన్నడం గమనార్హం.