టిక్‌టాక్ కొనుగోలు కోసం మైక్రోసాఫ్ట్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ డెడ్‌లైన్ విధించారు. సెప్టెంబర్ 15లోగా ప్రక్రియ పూర్తి చేయాలని లేదా టిక్‌టాక్‌ను మూసివేయాలని వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తే.. తమకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఏ అమెరికన్ కంపెనీ అయినా సరే.. ఆ ట్రాన్సాక్షన్‌లో అమెరికా ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించాలని కండిషన్ పెట్టారు.
టిక్‌టాక్‌ను అమెరికాలోనూ నిషేధిస్తామని ట్రంప్.. ప్రకటించడంతో ఆ సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. అయితే ఇదే సమయంలో దాన్ని కొనుగోలు చేస్తామంటూ మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది.ఈ మేరకు ట్రంప్‌తో ఈ విషయమై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల చర్చించారు కూడా. టిక్‌టాక్‌ను పూర్తిగా అమెరికన్ కంపెనీగా మారుస్తామని ట్రంప్‌కు ఆయన వివరించారు.