తొలివెలుగు టీం:
ఫిబ్రవరి 24న భారత్‌కు రాబోతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… నేరుగా గుజరాత్ చేరుకోబోతున్నారు. గుజరాత్‌లో ల్యాండ్ అయ్యాక అప్పటికే సిద్దంగా ఉన్న బాంబు ప్రూఫ్ కారులో సర్ధార్ పటేల్ స్టేడియం చేరుకోబోతున్నారు. సింహం అని పిలవబడే ట్రంప్ కారులో మనకు తెలియని ఎన్నో విశేషాలున్నాయి.
ట్రంప్ బాంబు ప్రూఫ్ కారులో విశేషాల్లోకి వెళితే….
1. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఓబామా వాడిన కాడిల్లాక్ వన్ తర్వాత ఈ కారు వచ్చింది. సెప్టెంబర్ 24, 2018 నుండి ట్రంప్ కాన్వాయ్‌లో అందుబాటులో ఉంటుంది.
2.ఈ కారు విండోస్ అన్నీ గ్లాస్‌తో పాటు పాలీకార్బోనేట్‌తో ఐదు లేయర్లుగా తయారు చేయబడ్డాయి. దృడంగా ఉండేందుకు ఇలా తీర్చిదిద్దారు. ఎలాంటి బుల్లెట్స్ అయినాఈ అద్దాన్ని పగులగొట్టుకొని లోపలికి రావటం అసాధ్యం. ఇక ఈ కారులోని ఒక్క డ్రైవర్ విండో మాత్రమే మూడు ఇంచులు ఓపెన్ అవుతుంది. మిగతావన్నీ ఫిక్స్‌గానే ఉంటాయి.
3.టియర్ గ్యాస్ కేనాన్స్, బాంబ్స్ ఏవీ కూడా ఈ కారును ఏమీ చేయలేవు.
4. డ్రైవర్ క్యాబిన్ నుండి డ్రైవర్ నేరుగా సాటిలైట్ ఫోన్ ద్వారా అమెరికా భద్రతాదళాలతో మాట్లాడుకునే వీలు ఉంటుంది. జీపీఎస్ ట్రాకింగ్ కూడా అదనంగా ఉంటుంది. డ్రైవర్‌గా ఉండే వ్యక్తి సూపర్ కాప్ అయి ఉంటాడు. నిష్ణాతులపైన డ్రైవర్స్‌ను మాత్రమే ట్రంప్ కోసం ఎంపిక చేస్తారు. ఎలాంటి అత్యవరసర పరిస్థితుల్లో అయినా చాకచక్యంగా బయటపడగలిగే నైపుణ్యంతో పాటు కారును ఉన్న ఫలంగా కారును 180డిగ్రీల కోణంలో తిప్పగలడు.
5.నైట్ విజన్ కెమెరాలు, బాంబులు, మైన్‌లను సైతం తట్టుకొని చెక్కుచెదరకుండా ఉండే సామర్థ్యం ఈ సింహం లాంటి కారు సొంతం. ఈ కారు టైర్స్ అసలు పంక్చర్ కానే కావు. స్టీల్ రిమ్స్ ఉన్నప్పటికీ… ప్రమాద సమయంలో టైర్స్ పేలిపోయినా… ఎలాంటి ఇబ్బంది లేకుండా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే వీలు ఉంటుంది.
6.అమెరికా అధ్యక్షుడితో పాటు మరో నలుగురు ఈ కారులో కూర్చోవచ్చు. ప్రమాద సమయంలో లోపల ఉన్న అమెరికా అధ్యక్షుడికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ఆక్సిజన్ అందే ప్రత్యేక సదుపాయంతో పాటు ఎమర్జెన్సీ బటన్ కూడా ఉంటుంది.
7.ఇక ఈ కారు క్యాబిన్ డోర్స్ బోయింగ్ 757విమానం అంత 8 ఇంచుల మందంగా ఉంటాయి. రసాయన దాడులు సహా ఎలాంటి పేలుడు స్వభావం ఉన్న వాటిని నుండి అయినా లోపల ఉన్న వారిని ఈ కారు రక్షించగలదు.
8.ఇక ఈ కారులో ఉండే అమెరికా అధ్యక్షుడు సాటిలైట్ ఫోన్ ద్వారా ఆ దేశ ఉప రాష్ట్రపతి, అధికారులతో మాట్లాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.
ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కారు ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ కారు ఖరీదు 1.5 మిలియన్ అమెరికన్ డాలర్లట.