సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు విచారణ రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే స్థాయికి చేరింది. ముంబైలో విచారణ సరిగ్గా జరగడం లేదని బిహార్‌లోనూ కొందరు ఫిర్యాదులు చేయడంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. ముంబై పోలీసులు చేతవానికాళ్లేమీ కాదని ఆయన అన్నారు. ఎవరైనా తమ వద్ద సరైన ఆధారాలు ఉన్నాయని భావిస్తే వాటిని మాకివ్వండి… కచ్చితంగా విచారణ జరిపి అందుకు కారణమైనవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసును బిహార్, ముంబై పోలీసుల మధ్య పోటీగా చిత్రీకరించొద్దని ఆయన హితవు పలికారు.