సీఎం ఢిల్లీ టూర్ ఉందంటే అంతకంటే ముందు కేసీఅర్ తనయుడు మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్రం మంత్రులను కలిసిరావడం వెనుక ఆంతర్యం ఏమైఉంటుంది అనే చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది టీఆర్ఎస్ అధికారంలో కి వచ్చినప్పటినుండి కేంద్రంతో రాయభారం నడిపే బాధ్యత కేటీఆర్ కి అప్పచెప్పినట్టు తెలుస్తోంది ఎందుకంటే కేసీఅర్ టూర్ కి ముందు ఖచ్చితంగా కేటీఆర్ ఢిల్లీ టూర్ ఉంటుంది కేంద్రమంత్రులను కలుస్తాడు కేటీఆర్ కలిసే మంత్రుల జాబితాలో జావేదేఖర్ ఖచ్చితంగా ఉంటాడు అమిత్ షా అపాయింట్మెంట్ దొరికితే ఆయన నుకూడ కలుస్తాడు ఆతరువాత నాలుగైదు రోజులకు కేసీఅర్ ఢిల్లీ టూర్ ఉంటుంది కేసీఅర్ వెళ్లి ప్రధానిని అలాగే కేంద్రమంత్రులను రాజకీయ సర్దుబాటు తోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించి వస్తాడు అని పొలిటికల్ డెవలప్మెంటెన్స్ ను నిత్యం నిశితంగా పరిశీలించే వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఇటీవల ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ ఆర్టీసీ సమ్మె మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో హైకోర్టు లో పెండింగ్ లో కేసు ఇతర అంశాల గురించి కేంద్రంతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం ఆ తరువాతే కేసీఅర్ గవర్నర్ ను కలిసారని ఆర్టీసీ సమ్మెకు ముగింపుపలికారని చెప్పుకొస్తున్నారు అటు మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా అంటున్నారు ఇలా కేంద్రానికి రాష్ట్రానికి గ్యాప్ వచ్చినప్పుడు కాని లేదా రాష్ట్రానికి సంబంధించిన ఏవైనా విషయాలు పెండింగ్ లో ఉన్న రాజకీయంగా కొన్ని విషయాలలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య గ్యాప్ వచ్చిన ప్రతిసారీ కేటీఆర్ ఢిల్లీ వెళ్లి లైన్ క్లియర్ చేసుకొని రావడం ఆతరువాత కేసీఅర్ వెళ్లి అన్ని చక్కద్ధిదుకొని రావడం జరుగుతుంది అంటున్నారు కావాలంటే గత ఆరు సంవ్సరాలుగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన చాలా సందర్భాలలో కేసీఅర్ వెళ్ళిన సంగతి మనకు అర్దం అవుతుంది అంటున్నారు దీనిలో ఎంత నిజముందో లేదో తెలియదు కాని కేటీఆర్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేవలం తన శాఖకు సంబంధించిన కేంద్రమంత్రులను మాత్రమే కాకుండా ఇతర శాఖల మంత్రులను కూడా కలవడం కేటీఆర్ ఢిల్లీ టూర్ ముగించుకొని వచ్చాక కేసీఅర్ ఢిల్లీ వెళ్లిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నయానిపిస్తోంది అది యాదృచ్చికమా లేక రాజకీయ పరిశీలకులు చెప్పినట్లు కేసీఅర్ పర్యటనకు ముందు కేటీఆర్ ఢిల్లీ వెళ్లి అన్ని చక్కదిద్ది వస్తున్నాడో తెలియదు …….