మంచినీళ్లకు రంగు, రుచి వాసన ఉండదు అంటారు. పైగా పల్లెటూర్లలో నీరు స్వచ్ఛమైనవిగా భావిస్తుంటాం. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే ఆర్వో వాటర్‌నే జనం అసలైన మంచినీళ్లు అనుకుంటారు.
కానీ ప్రపంచంలోనే నెంబర్ వన్ క్రికెటర్ తాగే నీళ్లు ఇండియాలోనే దొరకదు. బయటి దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిందే. అదేంటీ… ఆ వాటర్‌లో అంతలా ఏం ఉంటుంది, అవి నీళ్ళేనా ఇంకా ఏమైనా కలుపుతారా అనే సందేహం రావటం సహాజం.
అవును కోహ్లి తాగే వాటర్ లీటర్ రూ.1500వరకు ఉంటుంది. బ్రాండ్ పేరు ఇవియన్. యూరప్‌లో ఇవియన్ అనే ప్రాంతంలో ఉండే మంచి నీటి సరస్సు పేరు ఇవియన్. ఆ సరస్సులోని నీళ్లలో సహజసిద్ధమైన మినరల్స్ ఉంటాయి. వాటిని తాగితే అనారోగ్యం దరికి కూడా చేరదట.
మొదట్లో కేవలం ఔషధాల తయారీకే వాడే ఈ ఇవియన్ నీరు కొంత మొత్తంలో తాగునీటికి కూడా ఉపయోగిస్తున్నారు. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని నీటిని మార్కెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇవియన్ నీరు ప్రపంచంలోని ప్రముఖలకు రెగ్యూలర్ వాటర్‌గా మారిపోయాయి. కోహ్లి తన మంచినీటి కోసం రోజుకు దాదాపు 6వేల నుండి 8 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తారని తెలుస్తోంది. అందుకే కోహ్లి ఫిట్‌గా ఎలాంటి అనారోగ్యం లేకుండా ధృడంగా ఉంటారు.
అయితే, కనీసం ఒక్కసారైనా రూ. 1500పోయినా పర్వాలేదు అని అనుకున్నా ఆ నీటిని తాగే అవకాశం మాత్రం సామాన్యులకు లేదు.