సత్యా్న్ని బందించలేరు.. కేంద్రంపై రాహుల్ ఫైర్
గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మెవానీ అరెస్టుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మెవానీ అరెస్టును అప్రజాస్వామికమని, అది రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు.
అసమ్మతిని అణిచి వేసేందుకు ప్రయత్నిస్తూ సత్యాన్ని ప్రధాని మోడీ బంధించలేరని పేర్కొన్నారు. ‘ మోడీ జీ. రాష్ట్ర యంత్రాగాన్ని దూషించడం ద్వారా అసమ్మతిని అణిచి వేసేందుకు మీరు ప్రయత్నించ వచ్చు. కానీ సత్యాన్ని మీరు జైలులో బంధించలేరు’ అని ట్వీట్ చేశారు.
ఈ వ్యాఖ్యలకు డరోమత్(భయపడకండి), సత్యమేవ జయతే అని హ్యాష్ ట్యాగ్ చేశారు. ఇక మెవానీ అరెస్టుపై అటు కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో స్పందించింది.
మెవానీ అరెస్టు అప్రజాస్వామికమని, ప్రజాప్రతినిధిగా ఆయన్ని ఎన్నుకున్న ప్రజలను ఇది అవమానించడమేనని కాంగ్రెస్ పేర్కొంది. ఈ అణిచివేతపై కాంగ్రెస్ కార్యకర్తలు తమ వాణిని వినిపిస్తారని తెలిపింది.