మన చిన్నచిన్న అలవాట్లే పెద్ద పెద్ద దుష్పరిమాణాలకు కారణమవుతాయి..మన సక్సెస్ కి అడ్డుపడేవి పెద్ద విషయాలు కాదు చాలా చిన్న విషయాలు..ఆ సత్యం తెలుసుకున్నప్పుడు బతకడం, లైఫ్లో సక్సెస్ సాధించడం ఎంత సింపులో అర్దం అవుతుంది..మన రోజు ఎలా గడవాలనేది మన దైనందిన జీవితంపైనే ఆధారపడుతుంది.. జస్ట్, ఒక్క రోజూ ఈ ప్లాన్ ఆచరించి చూడండి.. మీలో మార్పుని మీరే గమనిస్తారు…

చాలామంది టైం వేస్ట్ అయ్యేది ఉదయం లేట్ గా లేవడం మూలంగానే..ఒక్కసారి ఉదయాన్నే లేచి చూడండి.. ఎక్కువ గంటలు ఉన్నట్టుగా అనిపిస్తుంది ..
ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా మనసు,మెదడు ప్రశాంతంగా ఉంటుంది.. ప్రయత్నించండి..అలవాటు లేకపోతే చిన్నగా మొదలుపెట్టండి.హెల్త్ ఈజ్ వెల్త్ అన్నది ఈరోజుల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కాబట్టి ఆరోగ్యం కావాలంటే ఆహారంతోపాటు వ్యాయామం ముఖ్యమే..ఎక్సర్సైజ్ ని మీ లైఫ్ లో పార్ట్ చేస్కోండి.. కనీసం వాకింగ్ అయినా చేయగలగండి.
తర్వాత కొంచెం బ్రేక్ తీస్కుని స్నానం చేయండి.దీని ద్వారా మీ నిద్ర మత్తు పూర్తిగా వదిలిపోతుంది..శరీరం తేలికగా అవుతుంది.
రెడీ అవ్వండి..మీకు నచ్చిన డ్రెస్ వేస్కోండి.. మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..
కాసేపు కూర్చుని ఆ రోజు మీరు చేయాల్సిన పనుల గురించి ఒక పేపర్ పై రాసుకోండి.. కేవలం ఆ రోజు చేయాల్సిన పనులే కాదు.. ఆ వారంలో ,నెలలో చేయాల్సిన ఏ పనులైన స్పురణకు వస్తే పేపర్ పై పెట్టేయండి..ఈ అలవాటు చాలా మంచిది.
కిచెన్ లోకి వెళ్లి టీ లేదంటే మరోటి మీరే స్వయంగా చేసుకుని రిలాక్స్ గా కూర్చుని తాగండి..
వెనక్కి వచ్చి ఇందాక మీరు పేపర్ పై పెట్టిన పనుల లిస్ట్ చూడండి.. వాటిల్లో ముందు చేయాల్సిన ప్రైమరీ వర్క్ ఏదన్నా ఉంటే చేయండి.లేదంటే అతి తక్కువ టైంలో అయిపోయే పని ఉంటే ముందు దాన్నిచేసేయండి..
ఆ వర్క్ కంప్లీట్ కాగానే పేపర్ పై మార్క్ చేయండి…మీకు తెలియకుండానే రీచార్జ్ అవుతారు..మరొక పని చేయడానికి సిద్దంగా ఉంటారు..
అలా పేపర్ పై రాసిన ప్రతి పనికి కంప్లీట్ కాగానే మార్క్ చేస్తూ ఉండండి.. మధ్యమధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి..
ఆ రోజు కంప్లీట్ చేయాల్సిన అన్ని పనులు అయ్యాక, సాయంత్రం ఒక్కసారి కాసేపు డాబాపైకి వెళ్లి ప్రకృతిని ఎంజాయ్ చేయండి..
మిమ్మల్ని మీరు అభినందించుకోండి.. ఇది బూస్టప్ లాంటిది..
పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నించండి..
ఆ రోజు మీరు సాధించిన చేసిన చిన్నచిన్న పనుల సక్సెస్ ని ఎంజాయ్ చేయండి.. ప్రతిరోజు అదే ప్లాన్ ఆచరిస్తే మీ రియల్ సక్సస్ ఎంతో దూరంలో ఉండదు..