తెలంగాణ లో జరుగుతున్న పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. కరోనా ప్రభావం తెలంగాణలో తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని పిల్ దాఖలైంది. కానీ రేపు జరిగే పరీక్ష మాత్రం యధాతథంగా కొనసాగుతుందని కోర్ట్ తీర్పు ఇచ్చింది.సోమవారం నుంచి ఈనెల 30 వరకు జరగాల్సిన టెన్త్ పరీక్షలు వాయిదా పడటంతో మిగిలిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేది ఈనెల 29న అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత తదుపరి నిర్ణయం వెలువరించనున్నారు.