తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశం జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం.
ఈడీ కేసును ఎలా ఎదుర్కోవాలి? నోటీసుల విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే విషయంపై నేతల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో శాసనమండలికి ఇద్దరిని నామినేట్ చేయాల్సి వుంది.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి ఇద్దరి పేర్లను సీఎం కేసీఆర్ సమావేశంలో ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇండ్ల స్థలాలు, క్రమబద్దీకరణ, పట్టాల పంపిణీపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే అవకాశం ఉన్నచోట పట్టాల పంపిణీ కోసం అనువైన స్థలాలు, వాటి వివరాలను అధికారులు గుర్తించారు. దీంతో పట్టాణ పంపిణీ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది. గ్రామకంఠం సహా ఇతరత్రా ఇండ్ల స్థలాల అంశాలను పరిష్కరించి పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.