మంత్రి కేటీఆర్, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ మాణికం ఠాగూర్ మధ్య రెండు రోజులుగా ట్విట్టర్ వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. మాణికం ఠాగూర్ ఏ పోస్టు పెట్టినా కేటీఆర్ మధ్యలో జోక్యం చేసుకుని కౌంటర్ ఇచ్చేందుకు తహతహలాడిపోతున్నారు. ఈక్రమంలో మాణికం ఠాగూర్‌ను విమర్శించబోయి.. కేటీఆర్ తానే ఆత్మరక్షణలో పడ్డారు. ఏం సమాధానం ఇవ్వాలో తెలియక సతమతమయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశిథరూర్‌పై రేవంత్ రెడ్డి ఆఫ్‌ది రికార్డు మాట్లాడిన మాటలను కూడా కొందరు జర్నలిస్టులు రికార్డు చేసి బయట వదలడాన్ని తప్పుబడుతూ.. సుపారీ జర్నలిస్టులు అంటూ విమర్శించారు. వారు చేసిన పని సరైనదని కాదని కామెంట్ చేశారు. అయితే ఈ పోస్ట్‌పై కేటీఆర్ అత్యుత్సాహానికి పోయారు. మరి పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం సుపారీ తీసుకున్న ఏఐసీసీ ఇంఛార్జీల సంగతి ఏమిటని మాణికం ఠాగూర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. అది తాను చెప్పిన మాట కాదని, స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీనే ఆన్ ది రికార్డు అన్నమాటలు అని.. కోమటిరెడ్డి పేపర్ క్లిప్పింగ్‌ను జత చేశారు. దీనికి మాణికం ఠాగూర్.. కేటీఆర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
Dear @KTRTRS
if you accept my party MP colleague ‘s angry words on one day will you accept that your father KCR is the “Biggest traitor “? https://t.co/0KP7XAYlA0 pic.twitter.com/6gD2hwMfqq— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) September 18, 2021
Advertisements
కేసీఆర్ అతిపెద్ద దేశద్రోహి అంటూ కోమటిరెడ్డి మాట్లాడిన మాటలను కోట్ చేస్తూ.. ఓ పేపర్ క్లిప్‌ను పోస్ట్ చేశారు మాణికం ఠాగూర్. కేసీఆర్ గురించి కోమటిరెడ్డి చెప్పిన మాట నిజమేనని కేటీఆర్ ఒప్పుకుంటే.. తనపై ఆయన చేసిన ఆరోపణలను కూడా నిజమేనని అంగీకరిస్తానని మాణికం ఠాగూర్ చెప్పారు. మరి దీనికి కేటీఆర్ సమాధానం ఏమిటో చూడాలి!