తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలో ఆకస్మికంగా పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్టుండి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన జిల్లాకు రావడం ఆసక్తి రేపింది. పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగంతో ఆయన కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై డీజీపీ ఆరా తీసినట్టుగా సమాచారం. హెలీప్యాడ్ వద్దనే అధికారులతో ఈ సమీక్ష నిర్వహించారు డీజీపీ.
మరోవైపు ఈ పర్యటనలో డీజీపీ జిల్లాలోని తిర్యానీ, మంగి, సిర్పూర్ (యు), జైనూర్, కెరామెరి, జోడేఘాట్‌తో పాటు పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అడవులపై డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించినట్టు సమాచారం. డీజీపీ పర్యటనపై మాట్లాడేందుకు జిల్లా పోలీసులు నిరాకరించారు. పర్యటన వివరాలను గోప్యంగా ఉంచారు.