యాక్టివ్ రాజకీయాల నుండి వచ్చిన కొత్త గవర్నర్ తమిళిసై… రానున్న రోజుల్లో రాజ్‌భవన్‌ను ప్రజా సచివాలయంగా మారుస్తారా..? ప్రజా దర్భార్ నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండనున్నారా..? రోజు రోజుకు దూకుడు పెంచుతోన్న గవర్నర్ నిర్ణయాలపై టీఆర్ఎస్‌లో అలజడి మొదలైందా…?
ప్రజాసమస్యల విషయం లో దూకుడుగా ఉంటున్నారు గవర్నర్ తమిళి సై. రాబోయే రోజుల్లో రాజభవన్ ని సెక్రటేరియట్ గా మార్చేస్తారేమో అని రాజకీయా వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. సచివాలయం కూల్చివేత పేరుతో ఉన్న సచివాలయాన్ని తరలించారు. దీంతో ప్రస్తుతం సచివాలయం ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. మరో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు రాకపోవటం తో సమస్యలను ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అధికారులే పీడితులై… ఇబ్బంది పెడుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. వెలుగులోకి రాకుండా… ఇబ్బందిపడుతూ, అధికారుల దౌర్జన్యాలకు ఇబ్బంది పడే ప్రజలు ఎంతో మంది ఉన్నారు. దాంతో ప్రజల చూపు ఇప్పుడు గవర్నర్‌పై పడింది. ఇప్పటికే గవర్నర్ కూడా ట్విట్టర్ వేదికగా వస్తోన్న ఫిర్యాధులపై స్పందిస్తున్నారు. తాజాగా దీపావళికి ప్రజా దర్బారు ను ఏర్పాటు చేశారు.
మరో వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె పై ఆలోచించి రంగప్రవేశం చేసిన తమిళి సై మొదట ఢిల్లీ పెద్దలను కలిసి, ఆర్టీసీ నాయకులు ఎప్పుడు కలవాలన్న టైం ఇస్తున్నారు. తమిళనాట బీజేపీకి అసలు అవకాశమే లేని చోట… బీజేపీని ముందుండి నడిపించి, అగ్రనాయకత్వాన్ని మెప్పించారు. అలాంటి యాక్టివ్ పాలిటిక్స్ నుండి వచ్చిన నేత… ఖచ్చితంగా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక గిరిజన శాఖపై అధికారులను పిలిపించుకొని మాట్లాడటం, తానే స్వయంగా గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించి, తండాల్లో ఒక రోజు బస చేస్తానని కూడా ప్రకటించారు.
అంతకుముందు విద్యాశాఖపై కూడా అధికారులతో రివ్యూ చేశారు. పైగా ఈ రెండు శాఖలు, ఆర్టీసీ అంశం కేసీఆర్ పెద్దగా పట్టించుకోనివి. గవర్నర్ మాత్రం కేసీఆర్ సవతితల్లి ప్రేమ చూపిస్తోన్న శాఖలనే ఎంచుకోవటం, ప్రజా దర్భార్‌లు మొదలుపెడుతుంటం… ఖచ్చితంగా రాజకీయంగా మరో పవర్ సెంటర్ అయితున్నట్లే అంటున్నారు విశ్లేషకులు.