ఏనుగు అంత్యక్రియల్లో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ పాల్గొన్నారు. ఏనుగు మృతికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమిళసై ట్విటర్ వేదికగా ఏనుగుతో తనకు ఉన్న అనుబంధాన్ని షేర్ చేశారు. మణకుళ అనే వినాయక ఆలయం తమిళనాడులో బాగా ప్రసిద్ధి చెందింది.
ఆ టెంపుల్ లో 1955లో లక్ష్మీ అనే ఏనుగును కానుకగా ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి లక్ష్మీ ఏనుగు ఆలయ సేవలోనే ఉంది. ఇటీవల ఏనుగు కాలికి ఏర్పడిన గాయంతో తీవ్ర అనారోగ్యం చెందింది. అనంతరం ఆ గాయంతో బాధపడుతూ బుధవారం తెల్లవారు జామున నడక కోసం తీసుకెళ్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఏనుగు కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఏనుగును చివరి సారిగా చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
ఈ క్రమంలోనే కడసారి లక్ష్మీని చూసేందుకు తెలంగాణ గవర్నర్ తమిళసై మణకుళ ఆలయానికి వెళ్లారు. అక్కడ లక్ష్మీ ఏనుగుకి నివాళులర్పించారు. అనంతరం ట్విటర్ లో లక్ష్మీ గురించి ట్వీట్ చేశారు.
Paid last respects to “Laxmi” Sri Manakula Vinayagar Temple’s Spiritual Elephant in #Puducherry.
Recalled her blessings during my visits to the temple.புதுச்சேரி,அருள்மிகு ஸ்ரீமணக்குள விநாயகர் திருக்கோயில் யானை லட்சுமியின் பூத உடலுக்கு மலர்தூவி அஞ்சலி செலுத்தினேன். pic.twitter.com/XFIdJTkNnu
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 30, 2022