తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం 2021-22 బడ్జెట్‌ను ఆమోదించింది. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక శాసన మండలికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను సమర్పిస్తారు.