గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరంలో ఉచిత మంచి నీటి సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. పథకం ప్రయోజనాలు పొందాలంటే పాటించాల్సిన నిబంధనలను వెల్లడించింది. ప్రధానంగా ఆధార్ కార్డ్ ప్రామాణికంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మురికివాడలు, బస్తీ ఏరియాల్లో నల్లాలకు మీటర్లు బిగించబోమన్న ప్రభుత్వం.. అపార్టుమెంట్లకు మాత్రం తప్పనిసరి చేసింది. 20 వేల లీటర్లు వినియోగం దాటితే.. ప్రస్తుతం టారిఫ్ ప్రకారం ఛార్జీలు వసూలు చేయనుంది. డొమెస్టిక్ యూజర్లు సొంత ఖర్చులతోనే మీటరు బిగించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఇక అపార్ట్‌మెంట్లకు ఉచిత నీటి సరఫరాపైనా సర్కార్ క్లారిటీ ఇచ్చింది. పథకాన్ని అపార్ట్‌మెంట్ల వారీగా కాకుండా.. ఫ్టాట్లవారీగానే అమలు చేయాలని నిర్ణయించింది. అపార్ట్‌మెంట్‌లోని ప్రతీ ఫ్లాట్‌కు కూడా 20 వేల లీటర్ల చొప్పున ఉచితంగా మంచినీళ్లు సరఫరా చేస్తుంది.