న్యూఇయర్ వస్తుందంటే చాలు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. మందుబాబులు అంతా వైన్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ వినిపించింది. బార్లు, పబ్బులు, మద్యం షాపుల తెరిచి ఉంచే సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒంటి గంట వరకు మందుబాబులు ఇబ్బందులు పడకుండా వైన్ షాపులు తెరిచి ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్సు గల బార్ లు ఒంటి గంట వరకు విక్రయాలు కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.
కరోనా కష్టకాలంలో మద్యం అమ్మకాలు ఆగిపోయినందున, లైసెన్స్ లు పొందిన షాపు యజమానులు, బార్ నిర్వాహకులకు మినహాయింపుగా ఇలా విక్రయించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్. దీంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. కొత్త సంవత్సరం కేసీఆర్ న్యూ ఇయర గిఫ్ట్ అందించారని సంతోషంలో ఉన్నారు.
హైదరాబాద్ నగరం న్యూ ఇయర్ జోష్ కు రెడీ అవుతోంది. రెండేండ్ల కరోనా గ్యాప్ తర్వాత.. పూర్తి స్థాయిలో వేడుకలు జరగనున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది డిసెంబర్ 31 శనివారం రావటంతో వీకెండ్ కూడా కలిసి వస్తోంది. దీంతో ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు యువత రెడీ అవుతోంది. వీటికి తగ్గట్టుగానే ప్రత్యేక ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. 31 రాత్రి నుంచి జనవరి 1న మార్నింగ్ వరకు నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రేస్ వే, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు… పలు ప్లై ఓవర్లు మూసివేయనున్నారు.