తెలంగాణలో 10+2 విద్యా విధానం అమల్లోకి రానుంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది నుంచే అన్ని పాఠశాలల్లో ఇంటర్ తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. జాతీయ విద్యా విధానం ప్రకారం పాఠశాల విద్య పరిధిలోకే ఇంటర్ తరగతులు కూడా రావాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటనను ప్రభుత్వం చేసే అవకాశముంది.
ఈ నూతన విధానాన్ని (10+2) అన్ని పాఠశాలల్లో ఒకేసారి కాకుండా.. దశలవారీగా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇంటర్ విద్యామండలి కూడా ఎస్సెస్సీ బోర్డులో విలీనమయ్యే అవకాశం ఉంది.అంటే ఇంటర్ పరీక్షల నిర్వహణ బాధ్యత ఎస్సెస్సీ బోర్డు పరిధిలోకి వస్తుంది.