ఇంటర్మీడియేట్ విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆన్‌లైన్ క్లాసులతో కలిపి మొత్తం 220 రోజులతో కూడిన అకాడమిక్ ఇయర్‌ను ఖరారు చేసింది. దసరాకు 5 రోజులు, సంక్రాంతికి 3 రోజులు సెలువులు ఇస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఇంటర్మీడియేట్‌కు సంబంధించి కొత్తగా అర్ధ సంవత్సర, ప్రి ఫైనల్ పరీక్షలని కూడా నిర్వహించేందుకు నిర్ణయించింది.
ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ వివరాలు
– డిసెంబర్ 13-18 వరకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్
– ఫిబ్రవరి 10 -18 వరకు ప్రి ఫైనల్ ఎగ్జామ్స్
– ఫిబ్రవరి 23 – మార్చి 15 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్
– మార్చి 23 నుంచి ఇంటర్ యాన్యువల్ ఎగ్జామ్స్
-మేలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్
-ఏప్రిల్ 14 – మే 31 వరకు వేసవి సెలవులు.
-జూన్ 1న తిరిగి కాలేజీల ప్రారంభం