గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రిజర్వేషన్, రొటేషన్ చేపట్టకుండానే ఎన్నికలు నిర్వహిస్తామనటంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీ చట్టానికి ఇది విరుద్ధమని, రిజర్వేషన్ పాలసీలోని 52ఈ కి విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా స్టే విధించాలని కోరారు.
పిటిషనర్ తరుపు వాదనలు విన్న జస్టిస్ అభిషేక్ రెడ్డి… విచారణను చీఫ్ జస్టిస్ బెంచ్ కు కేసును బదిలీ చేశారు. దీనిపై మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దర్మాసనం విచారణ చేయనుంది. పిటిషనర్ తరుపున ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు.