కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుంది : హైకోర్టు - Tolivelugu

కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుంది : హైకోర్టు

Telangana High court on Cabinet Decision, కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుంది : హైకోర్టు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె…రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర మోటారు వాహనా చట్టం సెక్షన్-17 ప్రకారం ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టీసీ, ప్రైవేట్ రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయం తప్పెలా అవుతుందని కోర్టు పిటిషనర్‌ ను ప్రశ్నించింది. సెక్షన్ 102 ప్రకారం ఏ మార్పు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగదని సీఎం కేసీఆర్ చెప్పారని ప్రభాకర్ అన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు…సీఎం ఏం చెప్పారన్నది హైకోర్టు కు సంబంధం లేని విషయమంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp