యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన మాజీ డీఎస్పీ రాఘవ రెడ్డికి రైతు బంధు పథకం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు రెండు, మూడో విడుత నిధులు తనకు అందక పోవడంతో రాఘవరెడ్డి పలు మార్లు అధికారులను కలిశారు. విజ్ఞాపణ పత్రాలు అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి పైసలు అందకపోవడంతో హైకోర్టు నాశ్రయించారు. అతని పిటిషన్ ను విచారించిన హైకోర్టు రాఘవరెడ్డికి వెంటనే రైతు బంధు పథకం నిధులు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.