తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ముందుగానే ఎన్నికల సంఘం షెడ్యూలు ఎలా విడుదల చేసిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు ఆ పిటిషన్ ను కొట్టి వేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 10 కార్పోరేషన్లు, 120 మున్సిపాల్టీలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఆ షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 22న పోలింగ్..25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్