తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ఎట్టకేలకు విడుదల చేసింది బోర్డు. నేడో, రేపో కొత్త షెడ్యూల్ వస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో తాజాగా పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటించింది బోర్డు.
ఈసారి మే 6 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సవరించిన పరీక్షల షెడ్యూల్ ను బోర్డు విడుదల చేసింది. మే 6 నుంచి 24 వరకు పరీక్షలు కొనసాగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షా సమయాన్ని నిర్ణయించింది.
విద్యార్థులంతా పరీక్షలకు బాగా సన్నద్ధం కావాలని బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ సూచించారు. 40రోజులకు పైగా సమయం ఉందని.. జాగ్రత్తగా రీడింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలన్నారు.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు-తేదీలు
మే 6- సెకండ్ లాంగ్వేజ్
మే 9- ఇంగ్లీష్
మే 11- మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
మే 13- మ్యాథ్స్-బీ, జువాలజీ, హిస్టరీ
మే 16- ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 18- కెమిస్ట్రీ, కామర్స్
మే 20- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1
మే 23- మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు-తేదీలు
మే 7- సెకండ్ లాంగ్వేజ్
మే 10- ఇంగ్లీష్
మే 12- మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
మే 14- మ్యాథ్స్-బీ, జువాలజీ, హిస్టరీ
మే 17- ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 19- కెమిస్ట్రీ, కామర్స్
మే 21- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2
మే 24- మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి