కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వినతిని పట్టించుకోని కేంద్రం కూలీలకు, రైతులకు తీరని అన్యాయం చేస్తోందని చెప్పారు.
ఉపాధి హామీ బడ్జెట్ పై కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు స్పందించాలని కోరారు. అన్ని రాష్ట్రాల రైతులకు కేంద్రం మొండిచేయి చూపిందన్నారు.
గత బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి రూ.80 వేల కోట్లు కేటాయిస్తే ఈసారి బడ్జెట్లో దాన్ని రూ. 30 వేల కోట్లకు తగ్గించారని అన్నారు. రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం ఎత్తేసే ఆలోచనలో ఉందని ఆరోపించారు ఎర్రబెల్లి.
అనంతరం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. మరోవైపు కేంద్రం ప్రవేశపెట్టింది రైతు వ్యతిరేక బడ్జెట్ అని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ అన్నారు. రైతులకు అనుకూలంగా బడ్జెట్ లో ఏమీ లేదన్న ఆయన.. అన్నదాతలకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. 150 మెడికల్ కాలేజీలు ఇచ్చామన్న కేంద్రం అందులో ఒక్కటి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదన్న విషయాన్ని నామా గుర్తు చేశారు.