తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై ముగ్గురు కేంద్ర కేబినెట్ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శిస్తూ, సెటైర్లు వేశారు. కేంద్ర మంత్రులు చేసిన ట్వీట్లను కేటీఆర్ షేర్ చేశారు.
తెలంగాణకు మెడికల్ కాలేజీలు 9 మంజూరయ్యాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పగా.. మన్సుఖ్ మాండవీయ ఏమో జీరో ప్రతిపాదనలు అందాయని అన్నారు. ఇక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు ప్రతిపాదనలు అందాయంటూ చెబుతున్నారు.
వీరిలో వీరికే క్లారిటీ లేదంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. మోడీజీ మీ మంత్రులకు కనీసం అబద్ధాలు, బూటకాలను నిలబెట్టడానికి ఓకేలా ట్రైనింగ్ ఇవ్వాలంటూ సెటైర్లు వేశారు.
కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణలో 9 నాన్-ఎగ్జిస్టెంట్ మెడికల్ కాలేజీలను గాలిలో లేకుండా, హైదరాబాద్ లో కల్పిత గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారని విమర్శించారు కేటీఆర్.