డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ నగరానికి చేరుకున్నాయి. మంగళవారం మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను సీఎస్ శాంతి కుమారితో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ నెల 11న ఫార్ములా ఈ-ప్రిక్స్ లో భాగంగా ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ స్ట్రెచ్ లను కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ తిరుగుతాయి.
11 వ తేదీ తర్వాత నగరానికి పర్యాటకాన్ని పెంపొందించడానికి బస్సులను హెరిటేజ్ సర్క్యూట్ లో ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. సాంప్రదాయ డబుల్ డెక్కర్ బస్సులు నిజాం చేత ప్రారంభించబడి.. 2003 వరకు నగరంలో తిరిగాయి.
గతంలో ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేస్తూ హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశ పెట్టాలని కోరగా కేటీఆర్ స్పందిస్తూ త్వరలోనే తీసుకొస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇచ్చిన మాట మేరకు ఎట్టకేలకు నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చారు.
ప్రస్తుతం ఉన్న మూడు బస్సులను ప్రారంభించగా.. త్వరలోనే 20కి పెంచాలని హెచ్‌ఎండీఏ నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఎలక్రిక్ బస్సు ధర రూ.2.16కోట్లు. బస్సుల్లో డ్రైవర్ తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చునేలా సీటింగ్ సామర్థ్యం ఉంది. బస్సు ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
హైదరాబాద్ నగరంలో మూడు డబుల్ డెక్కర్ బస్సులను చీఫ్ సెక్రటరీ శాంతి కుమారితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో @DrRanjithReddy, @imAkbarOwaisi పాల్గొన్నారు. మరో మూడు బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. pic.twitter.com/4WkUnwjzGG
— Namasthe Telangana (@ntdailyonline) February 7, 2023