కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. కనీస సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. ముందుగా.. బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణువర్థన్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు.
బండిని జోకర్ ఎంపీ అంటూ ట్వీట్ చేశారు. దీన్ని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు ‘ఢిల్లీలో పరమానందయ్య గారి ఫేకుడు.. ఆయన గారి శిష్యులు ఇక్కడ జోకుడు’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఈయన ఒక ఎంపీ, అది కూడా కరీంనగర్ నుంచి అని తల కొట్టుకుంటున్నట్టుగా ఉండే ఎమోజీని యాడ్ చేశారు.
ఇప్పుడు ఈ వీడియోను బీఆర్ఎస్ టీమ్ నెట్టింట అన్ని గ్రూపుల్లోనూ షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఈయన ఒక ఎంపీనా.. మన ఖర్మరా బాబూ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఢిల్లీ లో పరమానందయ్య గారు ఫేకుడు, ఆయన గారి శిష్యులు ఇక్కడ జోకుడు 😂
ఈయన ఒక ఎంపీ, అది కూడా కరీంనగర్ నుండి 🤦♂️ https://t.co/ViYLziLnsH
— KTR (@KTRBRS) February 3, 2023
ఇంతకీ సంజయ్ ఏమన్నారంటే..?
ఢిల్లీలో మీడియా సమావేశంలో బండి మాట్లాడుతూ.. కాస్త తడబాటుకు గురయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా దేశాల ఆర్థిక పరిస్థితుల విషయంపై నిర్వహించే సర్వేలో భారతదేశం ప్రధాని మోడీ ‘బాధితులు’ చేపట్టకముందు పదో స్థానంలో ఉండేదని.. ఇప్పుడు ఐదో స్థానానికి ఎగబాకిందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బడ్జెట్ కి సంబంధించి పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అలా మాట్లాడే సందర్భంలో కొంత తడబాటుకు గురవడంతో అదే విషయాన్ని సెటైరికల్ గా బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియోలు రూపొందించి చురకలంటిస్తున్నారు.