తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ చిత్రీకరిస్తున్న సినిమాలపై మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. డాక్టర్ దండే శ్రీరాములు చేసిన మెసేజ్ ను కేటీఆర్ రీట్వీట్ చేశారు. తెలంగాణ సాంస్కృతిక రంగంలో పునరుజ్జీవనానికి కారణమైన కేసీఆర్ కు.. ఈ సందర్భంగా ధన్యవాదాలన్నారు. ఒకప్పుడు తెలంగాణ యాసను హేళన చేసిన చోటే.. ఇప్పుడు కీర్తి దక్కుతుందని కేటీఆర్ తన ట్వీట్ లో తెలిపారు.
మొదట డాక్టర్ దండే శ్రీరాములు కేటీఆర్ కు వాట్సాప్ లో మెసేజ్ చేశారు. ‘తెలంగాణ యాసలో ఇప్పుడు సినిమాలు వస్తున్నాయని, అవి అద్భుతంగా ప్రజాదరణ పొందడం చూస్తుంటే సంతోషంగా ఉందని, ఇందుకు బలగం, దసరా వంటి సినిమాలు మంచి ఉదాహరణగా నిలిచాయని.. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్ కే దక్కుతుందని.. డాక్టర్ దండే శ్రీరాములు అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ కు వాట్సాప్ మెసేజ్ చేశారు. సినిమాల్లో తెలంగాణ ప్రాంతం వారిని విలన్లు, జోకర్స్ గా చూపిస్తు ఉండటంతో 20 ఏండ్ల క్రితమే సినిమా థియేటర్ కు వెళ్లడం మానేసినట్లు’ పేర్కొన్నారు.
అయితే ఈ మెసేజ్ పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. సర్ మీ అభిప్రాయాన్ని ట్వీట్ చేయొచ్చా? అని అడిగారు. అది కూడా మీ అనుమతితో అని అడగ్గా.. శ్రీరాములు కూడా పాజిటివ్ గా స్పందించారు. తప్పకుండా సర్.. మీరు ట్వీట్ చేస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీలవుతాను.. థాంక్యూ వెరి మచ్ సర్ అంటూ శ్రీరాములు పేర్కొన్నారు.
దీంతో ఈ మెసేజ్ ను కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ప్రస్తుతం తెలుగు సినిమా పంథా మారిందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తెలుగు సినిమాలలో పెద్దపీట వేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంస్కృతిక రంగంలో పునరుజ్జీవనానికి కారణమైన కేసీఆర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ యాసను హేళన చేసిన చోటే.. ఇప్పుడు కీర్తి దక్కుతుందని కేటీఆర్ తన ట్వీట్ లో తెలిపారు.
Messages like this 👇😊
Thanks to KCR Garu for the renaissance on the cultural front
A dialect that was ridiculed is now taking centerstage 👍 pic.twitter.com/XuWZBxiYRF
— KTR (@KTRBRS) April 1, 2023