తెలంగాణలోని ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు శరవేగంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆయా మార్కెట్ లలో శాకాహారంతో పాటు మాంసాహారం లభిస్తోందని వివరించారు.
ఖమ్మం, నారాయణ పేట, భువనగిరిలో అందుబాటులోకి వచ్చిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల ఫొటోలను కేటీఆర్ షేర్ చేశారు. మార్కెట్ల నిర్మాణానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యేలను, మున్సిపల్ ఛైర్మన్లను ట్విట్టర్ లో అభినందించారు కేటీఆర్.
కాగా తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తోన్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల అంశంపై చర్చ జరిగింది. రెండు లక్షల జనాభాకు కనీసం ఒక మార్కెట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
శాస్త్రీయ విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మిస్తున్నామని శాసన సభలో తెలిపారు. నేలపై కూరగాయలు విక్రయిస్తే బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉందన్నారు. మోండా మార్కెట్ తరహాలో రాష్ట్రంలోనూ మార్కెట్లు నిర్మించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు కేటీఆర్.
This👇is a sample of how integrated veg & non-veg markets are being built by the Municipal Administration department in Telangana
Pics from Khammam Municipal Corporation 👍
My compliments to the Transport Minister @puvvada_ajay Garu, Mayor Garu and @cdmatelangana pic.twitter.com/VuYQowROUe
— KTR (@KTRBRS) February 14, 2023