తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్లు ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రాంతంలో తిరుగుతున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలపై ఫైర్ అయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఎంపీలపై షర్మిల చేసిన అనుచిత వాఖ్యలపై ఆమె స్పందించారు.
నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దని.. నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా వైఎస్ కుటుంబం కోట్ల రూపాయలు ఆర్జించి కొత్త పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి ఉరేగుతున్నారని మండిపడ్డారు.
ప్రజల చేత రెండు సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవితలను వైఎస్ షర్మిల ఇష్టం వచ్చినట్లు విమర్శించడం సరికాదని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసేవ కోసమే ఇతర పార్టీల నుండి ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. మీలాగా అక్రమ సంపాదన కోసం కాదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పేదల అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.