పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బుధవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. మా సోదరుడు పొంగులేటి ఏదేదో మాట్లాడుతున్నారంట.. 24 గంటల కరెంట్ ఎక్కడ అని ప్రశ్నించారంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంతకంటే ఘనంగా తెలంగాణలో ఎవరూ మంచిగా చేస్తారో.. దమ్మున వారు ముందుకు రండి అంటూ ఆయన సవాల్ విసిరారు.
ప్రజా క్షేత్రంలో ప్రజల మనస్సు గెలవాలని అన్నారు. కేవలం ప్రభుత్వాన్ని, ప్రజల పాలకులను తిడితే అధికారం రాదన్న విషయం గ్రహించాలని సూచించారు. తెలంగాణలో ఏర్పడ్డ లక్ష్యాలు అమలు చేయడం లేదని.. పొంగులేటి అనడం విడ్డూరంగా ఉందన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. రైతులు పడించిన పంటను కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన బీజేపీ.. ఇక్కడ అధికారంలోకి వస్తుందని.. ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీకి.. కేసీఆర్ ని తిట్టడం తప్ప మరే పని చేత కానట్టుందంటూ ఎద్దేవా చేశారు. కరోనా పరిస్థితుల్లో రుణమాపీ అమలు చేయలేకపోయామని, అయినా వడ్డీతో సహా రుణమాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఉన్నారన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.