వినాయక చవితి వేళ తెలంగాణ పోలీసుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. వినాయకుడి విగ్రహాన్ని అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. వీడియోలో.. వినాయకుడి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తమ వాహనంలోని ముందు సీట్లో పెట్టారు. విగ్రహం గురించి ఓ యువకుడు పోలీసులతో వాదిస్తున్నట్టుగా అందులో ఉంది. ఈ వీడియోను ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
తెలంగాణలో గణేష్ వేడుకలను నిషేధించడమే కాదు.. విగ్రహాన్ని అరెస్ట్ చేసి దేవుడిని అరెస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్‌కు హిందు ఫోబియా ఎంతలా ఉందో దీంతోనే అర్థమవుతోందని ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇదే..
Telangana govt not only banned the #Ganeshotsav celebration in Telangana but also insulted Ganpati bappa by "arresting" him.
This is pure Hinduphobia displayed by @TelanganaCMO @KTRTRS. #Shame pic.twitter.com/k7okeAl0hf
— S.Vishnu Vardhan Reddy (@SVishnuReddy) September 10, 2021
Advertisements
ఇదిలా ఉంటే ఈ ఘటన పాతబస్తీలోని చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం రక్షపురం కాలనీలో జరిగినట్టుగా తెలుస్తోంది. వినాయకుని మంటపాన్ని తొలగించిన పోలీసులు.. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం.