వాస్తులో కేసీఆర్‌కి పోటీగా పోలీసులు - Tolivelugu

వాస్తులో కేసీఆర్‌కి పోటీగా పోలీసులు

రాష్ట్ర ప్రభుత్వ పెద్ద ఎలా ఉంటే… పాలన అలా ఉంటుంది. తన ఉద్యోగుల ప్రవర్తన అలాగే ఉంటుంది. సీఎం ఎలాగైతే తన ఆఫీసు సచివాలయం, క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్‌కు వాస్తు సరిచేసుకుంటున్నారో… కింది స్థాయి ఉద్యోగులు కూడా అదే పాటిస్తున్నారు. తమకు వీలుంటే వాస్తు సరిచేయటం లేదంటే… పైరవితో చెక్కెయటం కామనైపోయింది.

రాష్ట్రంలో పరిపాలించే నాయకుడు ఎలా ఉంటే, ఆయన ఆలోచనలు ఎలా ఉంటే… మంత్రులు, ఉద్యోగుల ఆలోచన కూడా అలాగే ఉంటుంది. ఇప్పటికే మంత్రులు… తమ నేతను ఆదర్శంగా తీసుకొని వాస్తు దోషాలు చూసుకొని, ఉంటే సరిచేసుకొని… పాలన సాగిస్తున్నారు. కొంతమంది నేతలైతే… తాము ఆఫీసులో అడుగుపెట్టక ముందే తమ సిబ్బందితో చెక్ చేయించి, వాస్తు దోషాలు చూసుకొని అడుగుపెడుతారు. తాజాగా ఈలిస్ట్‌లో ఉద్యోగులూ చేరిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా… వాస్తు బాగుచేయటం, లేదంటే బదిలిపై వెళ్లిపోతున్నారు తప్పా… వాస్తును నమ్మకుండా డ్యూటీలు మాత్రం చేయటం లేదు.

ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లా కేంద్రంలోనూ జరిగింది. మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌కు సీఐ బాస్. అక్కడ ఆయన ఏది చెబితే అదే రూల్. పైగా సంపాదనకూ అవకాశం ఉంది. అలా ఉంటే… చుట్టు పక్కల సీఐల కన్నంతా అక్కడే ఉంటుంది. కానీ మంచిర్యాల స్టేషన్‌కు మాత్రం వెళ్లాలంటే అమ్మో అంటున్నారు. కారణం ఒక్కటే వాస్తుదోషం. మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌కు వాస్తు దోషం ఉంది… అక్కడ పనిచేసిన సిఐలు అంతా ఇప్పటి వరకు అవినీతి ఆరోపణలతో బదిలీ అయినవారే అని ఎవరూ అక్కడ పనిచేసేందుకు ముందుకు రావటం లేదు. చివరగా సీఐగా పనిచేసిన తిరుపతిరెడ్డి పోలీసుస్టేషన్‌ వాస్తు దోషాన్ని సరిచేసే ప్రయత్నం కూడా చేశారు. దక్షిణం వైపు ఉన్న ప్రవేశద్వారాన్ని ఉత్తరం దిశగా మార్చారు. అయినా కొద్దిరోజుల్లోనే రిక్వెస్ట్‌ చేసుకొని మరీ బదిలీపై వెళ్లిపోయారు. అంతే అప్పటి నుండి ఇప్పటి వరకు కొత్త సీఐ ఎవరూ రాలేదు. దాదాపు నెలన్నరగా అక్కడ ఆ పోస్ట్‌ ఖాళీగానే ఉంది.

ts police following cmkcr in vasthu, వాస్తులో కేసీఆర్‌కి పోటీగా పోలీసులు

ఒక్క మంచిర్యాల మాత్రమే కాదు… సీఎం సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజవకర్గంలోని కొండపాక మండలంలో రాజీవ్‌ రహాదారిపై ఉన్న కుకునూర్ పల్లి పోలీస్‌స్టేషన్‌లోనూ ఇదే జరిగింది. అక్కడ పనిచేస్తున్న ఇద్దరు ఎస్సైలు రామక్రిష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు ఏడాదిలోనే తమ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయారు. దాంతో… అక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అక్కడా కారణం ఇదే…. వాస్తు దోషం. వెంటనే అక్కడ స్టేషన్‌ను మార్పులు చేర్పులు చేశారు. కొత్తగా వచ్చిన ఎస్సై కొన్నాళ్లపాటు ఉన్నా… మళ్లీ ఏదో ఒక మార్పు చేస్తూ దోష నివారణ చేస్తూనే ఉన్నారు.

ts police following cmkcr in vasthu, వాస్తులో కేసీఆర్‌కి పోటీగా పోలీసులు

ఇలా… చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, రహాదారుల మీద ఉన్న పోలీస్‌స్టేషన్లు, చుట్టూ గ్రామాలుతో కూడిన పట్టణ ప్రాంతాల పోలీస్‌స్టేషన్లు అంటే సంపాదనతో పాటు ఇబ్బందులూ ఉంటాయని, వాటిని తట్టుకొని నిలబడితే… బాగానే ఉన్నా, చాలామంది నాకొద్దీ టెన్షన్‌ అంటూ బదిలీపై వెళ్లిపోవటం, లేదా మరీ ఎక్కువ ట్రెస్‌కు గురై సుసైడ్ చేసుకోవటం పోలీస్‌శాఖలో కామనైపోయింది అంటున్నారు విశ్లేషకులు.

Share on facebook
Share on twitter
Share on whatsapp