టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం 30 వేల ఉద్యోగాలకు ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. టీచర్ ఉద్యోగాల కోసం నిర్వహించే టెట్ కు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈనెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలు అవుతుంది. ఏప్రిల్ 12ను చివరి తేదీగా గడువు విధించారు. జూన్ 12న టెట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో జరిగింది. ఇప్పుడు జూన్ 12న నిర్వహిస్తున్నారు.
టెట్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు, బీసీలకు 75, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. ఇందులో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.