తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక విషయాన్ని వెల్లడించింది. పోలీసు నియామక తుది పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు పేర్కొంది. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు టీఎస్ఎల్పీఆర్బీ మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. ఎస్ఐ(ఐటీ), ఏఎస్ఐ(ఫింగర్ ప్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల తేదీలు మార్పు చేశారు. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30వ తేదీన నిర్వహించనున్నారు.
మార్చి 12న జరగాల్సిన ఎస్ఐ(ఐటీ) పరీక్ష 11వ తేదీకి మార్చారు. ఏఎస్ఐ(ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12 నుంచి 11వ తేదీకి మార్చారు. కానిస్టేబుల్ (ఐటీ) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి మార్పు చేసింది టీఎస్ఎల్పీఆర్బీ.
కాగా రాష్ట్రంలో మొత్తం 12 సెంటర్లలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా.. 2,07,106 మంది అభ్యర్థులు ఈవెంట్స్ కి హాజరయ్యారు.వీరిలో 1,11,209 మంది అర్హత సాధించారు. మొత్తం 53.7 శాతం అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు వెల్లడించింది.
2018-19 నోటిఫికేషన్ లో 48.5 శాతం అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ లో అర్హత సాధించగా.. ఈ సారి 53.7 శాతం క్వాలిఫై అయ్యారని తెలిపింది. ఈవెంట్స్ మొత్తం ప్రక్రియను సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పేర్కొంది టీఎస్ఎల్పీఆర్బీ.