నిరుద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఎట్టకేలకు కీలక అడుగు పడింది. సోమవారం పోలీస్ జాబ్స్ కు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా గ్రూప్-1 పోస్టులకు వదిలింది. మొత్తం 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.
వీటిని ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మే 2 నుంచి 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జులై లేదా ఆగస్టులో.. మెయిన్స్ నవంబర్ లేదా డిసెంబర్ లో నిర్వహించే అవకాశం ఉంది.
తెలంగాణ ఏర్పడ్డాక విడుదలైన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇదే. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కేసీఆర్ ప్రభుత్వం. అర్హులైన అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చైర్మన్ జనార్థన్ రెడ్డి తెలిపారు.
గ్రూప్-1 పోస్టులు
ఎంపీడీవో – 121
డీఎస్పీ- 91
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్- 48
డిప్యూటీ కలెక్టర్- 42
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2- 41
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 40
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్- 38
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్- 26
అడ్మినిస్ట్రేటివ్ ట్రెజరర్- 20